దేశాన్ని లూటీ చేయడమే మోడీ ప్రభుత్వ విధానం

73చూసినవారు
దేశాన్ని లూటీ చేయడమే మోడీ ప్రభుత్వ విధానం
దేశ సంపదను స్వదేశీ, విదేశీ బడా కార్పోరేట్ , దోపిడీ వర్గాలకు దోచి పెట్టడం, దేశాన్ని లూటీ చేయడమే మోడీ ప్రభుత్వ , బీ జే పీ రాజకీయ విధానం అని ఇఫ్టూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్. జనార్ధన్, రాజా పేట శక్తి హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రేగు శ్రీశైలం లు స్పష్టం చేశారు. గురువారం నాడు రాజాపేటలో మోడీ కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ, ఈ రోజు నుండి 4 కార్మిక కోడ్ ల అమలును నిరసిస్తూ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఇఫ్టూ ఆధ్వర్యంలో బ్లాక్ డే గా పాటించడం జరిగింది. ఈ సందర్భంగా జనార్ధన్, శ్రీశైలం లు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న సుమారు 42 కార్మిక చట్టాలలో 29 చట్టాలను 4 కోడ్ లుగా విభజించి, 40 కోట్లకు పైగా కార్మికులకు తీరని అన్యాయాన్ని తలపెట్టి, కార్పొరేటు, పెట్టుబడి వర్గాలకు కార్మిక హక్కులను, శ్రమను దోచుకుంటూ, కనీస స్వేచ్ఛను హరించి వేస్తూ, దోపిడీ విధానాలను అనుసరిస్తున్న మోడీ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, బలమైన కార్మికోద్యమాన్ని నిర్మించాలని జనార్ధన్, శ్రీశైలం లు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో శక్తి హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కాకల్ల కనకయ్య, బుగ్గ నరసింహులు, ఎమ్మ బాలరాజు, మల్లేష్, వీరయ్య, పర్వతాలు, రంగ కనకయ్య, కొమురయ్య, మేక రవి, రంజిత్, దొంతి సురేష్, దోమల అంజి, పాండు, ఉపేందర్, సిద్ధుల తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్