పెండింగ్ బిల్స్ ను క్లియర్ చేయాలి
నల్గొండ -వరంగల్ -ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా మండల వ్యాప్తంగా ఓటరు నమోదు కార్యక్రమం మంగళవారం యుటిఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కె. జంగయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ డిఎలను విడుదల చేయాలని, ఆర్ధిక పరమైన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలన్నారు. కామన్ సర్వీస్ రూల్స్ రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.