బొమ్మలరామారం మండలం పిల్లిగుండ్ల తండా గ్రామ ప్రజలు గ్రామంలో మద్యం నిషేధిస్తున్నట్టు తెలిపారు. గ్రామ ప్రజలు బెల్ట్ షాపుల యజమానులు గ్రామ సభలో మాట్లాడుకొని గ్రామంలో సంపూర్ణ మద్యపానం నిషేధానికి తీర్మానం చేసుకున్నట్లు తెలిపారు. మద్యం అమ్మితే 25 వేలు జరిమానాతో పాటు ఎక్సైజ్ అధికారులకు పట్టించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి, పంచాయతీ సెక్రటరీ, పలువురు గ్రామ ప్రజలు, బెల్ట్ షాపుల యజమానులు పాల్గొన్నారు.