పార్లమెంటులో అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో భువనగిరిలో ఆందోళన చేపట్టారు. స్థానిక జెగ్జీవన్ రావు చౌరస్తాలో కేంద్ర మంత్రి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కౌన్సిలర్ ఈరపాక నరసింహ, దార్గాయి హరిప్రసాద్, బెండే ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.