రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల రికార్డులను తప్పులు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు బుధవారం అన్నారు. ఆలేరు, రాజాపేట, మోటకొండూరు తహశీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులందరూ నిబద్ధతతో పని చేయాలన్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని, డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పుడు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.