మక్తల్: హెడ్మాస్టర్ పై దాడి చేసిన వారిని శిక్షించాలి
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రాములుపై దాడి చేసిన వారిని శిక్షించాలని టీ ఎస్ యూటీఎఫ్ నాయకులు వేణుగోపాల్ అన్నారు. దాడి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప భక్తుల ముసుగులో వున్న కొందరు దాడి చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్, డిటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.