మక్తల్: అనుమానాస్పద స్థితిలో కతలప్ప మృతి
కృష్ణ మండలానికి చెందిన కురువ కతలప్ప (50) ఈ నెల 8 న ఇంట్లో గొడవపడి వెళ్ళిపోయాడు. బుధవారం గ్రామ శివారులో గొర్రెల కాపరులు కతలప్ప మృతదేహం చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్సై ఎండి నవీద్ తెలిపారు.