మోటర్ వాహనాల సవరణ బిల్లును రద్దు చేయాలి- ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి

558చూసినవారు
మోటర్ వాహనాల  సవరణ బిల్లును రద్దు చేయాలి- ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మోటర్ వాహనాల సవరణ బిల్లు-2019 తో రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్నఆటో, ట్రాక్టర్, లారీ, డీసీఎం తదితర రంగాల కార్మికుల బ్రతుకులను వీధిపాలు చేస్తుందని ఏఐటీయూసీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ విమర్శించారు.శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో శ్రీ మచ్చగిరి లక్ష్మి నర్సింహ స్వామి ఆటో ట్రాలీ ఓనర్స్ & డ్రైవర్స్ యూనియన్ సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ మోటార్ వాహన చట్ట సవరణ బిల్లును వెంటనే రద్దు చేయడంతో పాటు, చదువుతో సంబంధం లేకుండా లైసెన్సులు మంజూరు, రెన్యువల్ చేయాలని, కార్మికులందరికీ ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి - డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్