TG: ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి సూర్యదేవ్ అనే యువకుడు ఒకే మండపంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్మూర్ గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. జల్కర్ దేవి, లాల్ దేవి అనే అమ్మాయిలను సూర్యదేవ్ ప్రేమించి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు కలిసి జీవించాలని నిర్ణయించుకోవడంతో చేసేదేమి లేక పెద్దలు పెళ్లి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.