చెన్నైలోని RK నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పులియన్‌తోప్ ప్రాంతానికి చెందిన రాజన్ (30).. ఇద్దరు వ్యక్తులు చేసిన దాడికి సంబంధించి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కి వచ్చాడు. అయితే ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడు. పోలీసులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారు. దీంతో అతను కోపంతో స్టేషన్ వెలుపలికి వచ్చి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.