TG: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాలేదని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వివరాల ప్రకారం.. మేడిపల్లి పరిధిలోని జవహర్ నగర్‌కు చెందిన సాయి పవన్ (28) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన సాయి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.