అదనపు కట్నం వేధింపులతో యువతి ఆత్మహత్య

1071చూసినవారు
అదనపు కట్నం వేధింపులతో యువతి ఆత్మహత్య
అదనపు కట్నం కోసం వేధించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బేతి విజయ, వెంకటేశ్వర్లు దంపతుల కుమార్తె అర్చన(28)ను వరంగల్‌ జిల్లా కొత్తవాడకు చెందిన కందగట్ల సందీప్‌కు ఇచ్చి వివాహం చేశారు. సందీప్‌ అదనపు కట్నం హింసించాడు. దీంతో వేధింపులు భరించలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్