క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి (వీడియో)

24380చూసినవారు
ఇటీవల ఆకస్మిక గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వర్క్ అవుట్ చేస్తూ, ఆటలు ఆడుతూ యువకులు సైతం మృత్యువాత పడుతున్నారు. తాజాగా క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురై ఓ యువకుడు మృతి చెందాడు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. ఒక కంపెనీ తమ ఉద్యోగులకు క్రికెట్ మ్యాచ్ నిర్వహించింది. ఈ క్రమంలో సిక్స్‌లతో అదరగొట్టిన యువకుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్