ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన

52చూసినవారు
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు-2024, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. ఏడు విడతల పోలింగ్ విజయవంతంగా జరిగిందని చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఓటు వేసిన ఓటర్లు అందరికీ ఆయన ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్