రాత్రి పూట నిద్ర పట్టడం లేదా? ఇది ఫాలో అవండి
మనిషికి నిద్ర చాలా అవసరం. ప్రతి రోజు కనీసం 7 గంటలపాటు పడుకోవాలి. నిద్ర లేమితో చాలా మంది బాధపడుతూ ఉంటారు. వారు ఈ టిప్స్ ఫాలో అవండి. చేపలు, చెర్రీలు వంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలి. తరచూ వ్యాయామం, ధ్యానం చేయాలి. రాత్రి పూట ఎక్కువగా సెల్ ఫోన్లు చూడరాదు. కాఫీ, టీ, మద్యం, ధూమపానం తగ్గించాలి. మనసును ప్రశాంతంగా ఉంచే విధంగా మీ పడక గదిని తయారు చేసుకోవాలి.