ముద్దు పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయట. ఒత్తిడితో బాధపడుతున్నవారు తమకు ఇష్టమైనవారిని కిష్ చేయడం వల్ల ఆందోళన దూరమవుతుందట. ముద్దు పెట్టుకోవడం హ్యాపీ హార్మోన్స్ తో ముడి పడి ఉంటుంది. మీ బ్రెయిన్ కి మంచి ఫీలింగ్ ని ఇస్తుంది. ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్లు అందుతాయి. ఇవి ఆనందాన్ని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. కిష్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తితో రిలేషన్ మెరుగుపడుతుంది. అదే సమయంలో సంతోషంగా ఉండి, అందం పెరుగుతుందట.