బంగాళాఖాతంలో అల్ప పీడనం
నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న 36 గంటల్లో ఈ ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కొనసాగుతూ తమిళనాడు, శ్రీలంక వైపు కదులుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 12, 13, 14 తేదీల్లో ఏపీలోని రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.