హైదరాబాదీలకు అలర్ట్.. ఈ రెండు రోజులు జర భద్రం
ఇటీవల ఓ నాలుగు రోజులు నాన్‌స్టాప్‌గా కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. ఆ వర్షం పోయి.. పది రోజులపాటు ఎండలు వచ్చాయి. దీంతో జనాలంతా హమ్మయ్య అనుకున్నారు. కానీ ఇంతలోనే షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేసింది. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.