ఉత్తరాంధ్రలో చలిపులి!
ఉత్తరాంధ్రలో చలి తీవ్రత పెరిగింది. ప్రధానంగా ఉమ్మడి విశాఖ మన్యంలో జనాన్ని చలిపులి వణికిస్తోంది. మంగళవారం డుంబ్రిగుడలో 8.2, జి.మాడుగులలో 8.4, అరకు లోయలో 8.5, పాడేరులో10.9, ముంచంగిపుట్టులో 10.9, గూడెంకొత్తవీధిలో 11.4, చింతపల్లిలో 11.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఒకేలా మంచు కురుస్తోంది. దీంతో రోడ్డు కనిపించక రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.