‘దానా’ ఎఫెక్ట్: మొబైల్ ఛార్జింగ్.. గంటకు రూ.20
దానా తుపాను విధ్వంసంతో ఒడిశాలోని అనేక ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌కు గంటకు రూ.20 చొప్పున, ఇంటిపైన ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్‌లపైకి నీటిని తరలించేందుకు రూ.300 చొప్పున వసూలు చేస్తున్నట్లు బిష్ణుపుర్ పంచాయతీ సర్పంచ్ తెలిపారు. స్థానిక టెంట్ హౌస్‌లు, పెట్రోల్, డీజిల్‌తో నడిచే జనరేటర్లు ఉన్నవారు పెయిడ్ సర్వీసులు అందిస్తున్నారని పేర్కొన్నారు.