ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత
దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు గాలి నాణ్యత క్షీణించింది. పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగులబెడుతుండడంతో ఈ మేరకు కాలుష్యం పెరిగుతోంది. దీనికి తోడు పొగమంచు కూడా రాజధాని ప్రాంతాన్ని కమ్మేసింది. దీంతో శుక్రవారం ఉదయం 8 గంటలకి గాలి నాణ్యత 283 వద్ద నమోదైనట్లు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.