భారీ వర్షాలు.. చెన్నైలో నీటమునిగిన ఇంజినీరింగ్ కాలేజీ(వీడియో)
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో చెన్నైలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే స్థానిక సత్య భామ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో మూడు అడుగుల మేర నీరు చేరింది. ఈ మేరకు వందలాది మంది విద్యార్థులు నడుము లోతు నీటిలో బ్యాగులు తడవకుండా పరుపులపై వేసుకొని బయటకు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.