ఘోర ప్రమాదం.. 40 మందికి పైగా గాయాలు

కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హర్యానాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు హైదరాబాద్ కు చెందిన లక్ష్మి(13), గోవర్థిని(8) గా గుర్తించారు. 40 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బళ్లారి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్