బద్వేల్: రేపు జిల్లాకు వర్ష సూచన

కడప జిల్లాలో రేపు గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో బద్వేల్ నియోజకవర్గంలోనూ పలుచోట్ల వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. పంట కోతల విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్