టమాటా ధరలు రోజురోజుకు పడిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. నిన్న మొన్నటి వరకు కిలో రూ. 20 పలికిన టమాటా ధరలు తాజాగా కనిష్టానికి పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాలేదని.. దిగుబడి బాగా ఉన్నప్పటికీ ధరలు పడిపోతున్నాయని అంటున్నారు.