బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండలంలోని రెడ్డిపల్లి గ్రామ సమీపంలో మంగళవారం తెల్లారుజామున అదుపుతప్పి కారు బోల్తా పడడంతో ఇద్దరికీ గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.