కడప: అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు

ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా అటువంటి వారి పై పేలుడు పదార్థాల చట్టం, ఐపిసి సెక్షన్స్ ప్రకారం చర్యలు తప్పవని కడప జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విక్రయించాలని విక్రయదారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్