రేపల్లె డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస రావు

రేపల్లె డిఎస్పీగా ఆవుల శ్రీనివాసరావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా సత్య సాయి జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ గా పని చేస్తూ రేపల్లెకు బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న మురళీకృష్ణ తుళ్లూరు డిఎస్పీగా బదిలీ అయ్యారు. నూతన డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్