మంత్రి నారా లోకేశ్ సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్ మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలోని నివాసంలో లోకేశ్ ను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంగళగిరిలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.