నూజెండ్ల మండలం అయినవోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రవ్వారం కొండ వెనక డంపింగ్ యార్డ్ లో జూదమాడుతున్న 8 మందిని అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ ప్రభాకర్ తెలిపారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సోమవారం గ్రామంలో అకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. అనంతరం వారి వద్ద నుంచి 8 బైక్లు, రూ. 1,03,500ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.