మంత్రి లోకేశ్ టీ ష‌ర్టుపై చ‌ర్చ‌!

దావోస్ ఆర్థిక సదస్సుకు వెళ్లిన‌ మంత్రి లోకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో వెళ్లిన లోకేశ్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ సదస్సులో లోకేశ్ డ్రెస్ కోడ్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. దావోస్ తొలి రోజు సమావేశాల్లో లోకేశ్ టీ షర్టు ధరించి పారిశ్రామిక వేత్తలతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఒక అంతర్జాతీయ వేదికపై ప్రభుత్వ అధికార ప్రతినిధిగా అధికారిక హోదాలో వెళ్లిన లోకేశ్ ఇలా టీ షర్టు ధరించవచ్చా? అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్