వాసవీమాతకు 4.5 కేజీల వెండి మకర తోరణం

భీమవరం ఆర్యవైశ్య సంఘ భవనంలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దాతల సహకారంతో 4. 5 కేజీల వెండి మకర తోరణం అందించారు. సుమారు రూ. 4 లక్షల 50 వేలు విలువ చేసే వెండి మకర తోరణం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. అర్చకులు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి అలంకరణ చేశారు. శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దసరా మహోత్సవంలో భాగంగా శుక్రవారం గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

సంబంధిత పోస్ట్