2047 నాటికి అభివృద్ధిలో భారత్ టాప్-1: చంద్రబాబు

AP: ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం దావోస్‌లోని సీఐఐ నిర్వహించిన సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయన్నారు. విదేశాల్లో ఎక్కడ చూసిన మన వ్యాపారవేత్తలే కనిపిస్తున్నారన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఉందని, మోదీ నాయకత్వంలో భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. 2047 నాటికి అభివృద్ధిలో భారత్‌ టాప్-1లో ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్