అమలాపురం ఉపాధి హామీ పథకం పర్యటనలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఏ వేమవరం గ్రామంలో గురువారం ఉపాధి కూలీల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరావు మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఉపాధి హామీ పథకం నిధులు హార్టికల్చర్ కి అనుసంధానం చేస్తూ సంతకం చేయడం అన్యాయమని దీని పునరాఆలోచన చేయాలని కోరారు.