ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ పేర్కొన్నారు. సోమవారం జగ్గంపేటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టిడిపి నేత ఇనుప కోళ్ళ సంధ్య ఆర్థిక సహాయంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు భోజనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సోమవారం టిడిపి నాయకుల ఆర్థిక సహకారంతో అన్న క్యాంటీన్ పేరిట పేదలకు ఉచితంగా భోజనాలు పంపిణీ చేస్తామన్నారు.