కార్తీకమాసం పర్వదినాలు ముగింపు సందర్బంగా సామర్లకోట కుమార రామ భీమేశ్వరునికి సోమవారం జాటాజూట అలంకరణ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కటీ 30 కిలోల బరువుగల మూడు భారీ లడ్డూలను సామర్లకోట నీలిమ అధినేత, లయన్స్ ప్రతినిధి అమలకంటి శ్రీనివాసరావు ఆలయానికి అప్పగించారు. వాటిని స్వామి వారికి, అమ్మవారికి, మూల విరాట్టుల ఎదుట అలంకరించారు.