పూర్తిస్థాయి అవగాహనతోనే విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చునని, విద్యుత్తుతో ఏ ఒక్కరికి నిర్లక్ష్యం ఉండకూడదని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాట్ల శ్రీధర్ వర్మ అన్నారు. సోమవారం కడియం విద్యుత్ శాఖ సెక్షన్ కార్యాలయం వద్ద విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ప్రజలను చైతన్యపరిచి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.