ఇసుకపూడి సర్పంచ్ కు చెక్ పవర్ రద్దు

అంబాజీపేట మండలంలోని ఇసుకపూడి గ్రామ సర్పంచ్ మోహన్ సింగ్ బాబురావు చెక్పవర్ను రద్దు చేసినట్లు ఈవోపీఆర్డీ మమత శుక్రవారం తెలిపారు. గత పదేళ్లుగా పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గ్రామ ఎంపీటీసీ ప్రశాంత్ చేసిన ఫిర్యాదు మేరకు ఉన్నత అధికారులు సర్పంచు షోకాజ్ నోటీసులు జారీ చేశారన్నారు. దీనిపై సర్పంచ్ ఏ విధమైన సమాధానం ఇవ్వకపోవడంతో చెక్ పవర్ రద్దు చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్