పార్టీలో కష్టపడి పనిచేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపునివ్వాలని అంబాజీపేట మండలానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు కోరారు. ఆదివారం మండలంలోని నందంపూడి గ్రామంలో కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో నాయకుల పనితీరుపై వారు చర్చించుకున్నారు. అనంతరం పార్టీలోని నాయకులకు, కార్యకర్తలకు సమచిత స్థానం కల్పించాలని తీర్మానం చేశారు.