మామిడికుదురు మండలం పాసర్లపూడి కొండాలమ్మ చింత సెంటర్ చేరువలో బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద శనివారం ఆటో తిరగబడింది. రోడ్డు గోతిలో పడి ఒక్కసారిగా ఆటో తిరగబడిందని స్థానికులు తెలిపారు. మామిడికుదురు నుంచి డొక్కతాడు లోడుతో ఆటో బి. దొడ్డవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ సురక్షితంగా బయట పడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారి అధ్వానంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.