మామిడికుదురు: 'పశువుల వివరాలు నమోదు చేయించుకోవాలి'

మామిడికుదురు మండలం లూటుకుర్రు గ్రామంలో శుక్రవారం 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్, పి. గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు ప్రారంభించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. రైతులు తమ పశువుల వివరాలను పశు సంవర్ధక శాఖ ఉద్యోగులకు తెలియపరచాలని సూచించారు. పశువులకు సంబంధించిన సబ్సిడీ పథకాలు పేర్లు నమోదు చేయించుకున్న రైతులకే వర్తిస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్