తాళ్లరేవులో వాటర్ ప్లాంట్ సీజ్

జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాళ్లరేవులోని సత్య శ్రీ వాటర్ ప్లాంటును మంగళవారం తనిఖీ చేశారు. ప్లాంటులో ఏ పరీక్షలు నిర్వహించకుండా నకిలీ స్టిక్కర్లతో మంచినీటి బాటిళ్లను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. వాటరు మెషనరీలు, ట్యాంకులను సీజ్ చేశారు. రూ. 14 వేలు విలువచేసే బాటిల్స్, ప్యాకెట్లను గుర్తించి సీజ్ చేసి నిర్వహకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్