ఏలేశ్వరంలో నులి పురుగుల మందులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఏలేశ్వరం మండలం సిరిపురంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆయా పాఠశాలల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులను ఆమె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్