మత్స్యకారుడి ప్రాణం తీసిన 'చేపల వల’

మామిడికుదురు మండలం కరవాకకు చెందిన మత్స్యకారుడు కొప్పనాతి రాంబాబు(38) చేపల వేటకెళ్లి మృతి చెందినట్లు నగరం ఎస్సై పి. సురేష్ శుక్రవారం తెలిపారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఉదయం వేటకు వెళ్లిన రాంబాబు. వల విసురుతుండగా ప్రమాదవశాత్తు అదే వలలో చిక్కుకుని నీటిలో పడి మునిగిపోయాడన్నారు. రాంబాబు మృతితో కరవాకలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్