ఆత్మకూరు: 1400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

నాటు సారా తయారీ బట్టిలపై దాడులు నిర్వహించి సారా తయారికి సిద్ధంగా ఉన్న 1400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ శాఖ సిఐ కిషోర్ కుమార్ తెలిపారు. బుధవారం ఆత్మకూరు మండల పరిధిలోని సిద్దాపురం సమీపంలో అడవి ప్రాంతంలో జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించడం జరిగిందని సీఐ తెలిపారు. సిద్దాపురం గ్రామ సమీపంలోని అడవి ప్రాంతంలో దాడులు నిర్వహించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్