వరికుంటపాడులో పశుగణన సర్వే

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని పెద్దిరెడ్డిపల్లి, వరికుంటపాడు పశువైద్యశాల పరిధిలో శుక్రవారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల ఆఖరు వరకు 21వ అఖిలభారత పశుగణన సర్వే జరుగుతుందని మండల పశువైద్యశాఖ అధికారి రాఘవేంద్ర శర్మ గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. గ్రామాల్లో పశువైద్య సిబ్బంది ప్రతి ఇంటికి తిరిగి పశువులు, కోళ్లు, ఇతర మూగజీవాల వివరాలు నమోదు చేస్తారన్నారు. వారికి రైతులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్