అనంతపురం జిల్లాలో 421 దరఖాస్తుల స్వీకారణ.

అనంతపురం జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. సోమవారం వరకు అనంతపురం జిల్లాలో 136 మద్యం దుకాణాలకు గానూ 289, సత్యసాయి జిల్లాలో 87 దుకాణాలకు గానూ 132 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఇక మూడు రోజులే గడువుంది. అయితే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.

సంబంధిత పోస్ట్