కారు బోల్తా..తప్పిన ప్రమాదం

పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు గ్రామ సమీపంలో గురువారం ఓ కారు బోల్తా పడింది. ధర్మవరం పట్టణం కేశవనగర్ కు చెందిన జయక్రిష్ణ, జయలక్ష్మి దంపతులు కారులో పెద్దపప్పూరు మండలం నరసాపురంలో జరిగే ఓ నిశ్చితార్థ వేడుకకు బయలుదేరారు. చాగల్లు వద్ద పశువులు ఎదురుగా రావడంతో తప్పించబోయి కారు బోల్తా పడింది. స్థానికులు వెంటనే వారిని రక్షించారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదని ఎస్ఐ గౌస్ భాష తెలిపారు.

సంబంధిత పోస్ట్