అల్లరి నరేష్ అప్ కమింగ్ మూవీ ‘బచ్చల మల్లి’లో ఇంటెన్స్ రోల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్లో నరేశ్ మాస్ లుక్‌లో రిక్షాపై బీడి తాగుతున్నట్లుగా ఉన్న పోజ్ ఆకట్టుకుంటోంది. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఆయన హీరోగా నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలై నిరాశపర్చింది.