ఢిల్లీ రాజకీయాలను కాగ్ నివేదిక కుదిపేస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక విడుదల చేసింది. ఈ క్రమంలో AAP సర్కారుపై బీజేపీ విరుచుకుపడింది. ఈ నివేదిక ఆప్ నేతల అవినీతిని బట్టబయలు చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. మద్యం పాలసీపై కాగ్ లేవనెత్తిన ప్రశ్నలకు కేజ్రీవాల్ సమాధానం చెప్పాలని అనురాగ్ ఠాకుర్ డిమాండ్ చేశారు.